Sunday, 24 March 2013

http://ramamohanchinta.blogspot.in/


QUATAIONS

నేర్చుకోవడం ఆపితే ఆ రోజుతో మనిషి ఎదుగుదల ఆగిపోతుంది .నేర్చుకోవడం ఆపేసినరోజున మనిషి చనిపోయినట్టే.- అక్కినేని నాగేశ్వర రావు గారు

తెలుగు సాహిత్యం యుగ విభజన

నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది

తెలుగు సాహిత్యం కాలరేఖ
------------------------
నన్నయ యుగము-1000 - 1100
శివకవి యుగము-1100 - 1225
తిక్కన యుగము-1225 - 1320
ఎఱ్ఱన యుగము-1320 – 1400
శ్రీనాధ యుగము-1400 - 1500
రాయల యుగము-1500 - 1600
దక్షిణాంధ్ర యుగము-1600 - 1775
క్షీణ యుగము-1775 - 1875
ఆధునిక యుగము-1875 – 2000
21వ శతాబ్దితెలుగు సాహిత్యం కాలరేఖ

కవిత్రయం

Preview
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు
ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!
ఎఱ్ఱన్న(1325–1353)
Preview
******

బమ్మెర పోతన - 1450–1510

Preview
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?

అల్లసాని పెద్దన(15TH AND 16TH CENTURIES)

Preview
Preview

కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ 
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన

-తొలితెలుగు ప్రబంధం , ప్రథమాశ్వాసము మనుచరిత్ర-

భర్తృహరి


కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
స్సమఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని
మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.

శతకములు ,శతక కర్తలు


వేమన ( 1650 - 1750 ) శతకము
Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.
కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
Preview
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

No comments:

Post a Comment